సుద్దముక్కను చూసి పెదవి విరిచారు,
చివరకు అదే..అక్షరాలు రాసేంతగా..ఎదిగింది.
చెక్కముక్కను చూసి పక్కన పడేసారు,
అది కొండపల్లిబొమ్మైకూర్చుంది.
బండరాయిని ముండరాయి అన్నారు,
అది నందీశ్వరుడై తరించింది.
ఏ..ఒక్కరో ఇద్దరో చెప్పినవి జరగాలని లేదు.
జరిగాయని కాదు.
-----బండారు దానయ్యకవి.
No comments:
Post a Comment